దుబాయ్‌లో బిక్కుబిక్కుమంటున్న తెలుగు విద్యార్థులు
ఇరాన్ దాడుల నేపథ్యంలో దుబాయ్‌లోని భారత విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. దుబాయ్‌లో ప్రతిష్టాత్మక విద్యాసంస్థల క్యాంపస్‌లు ఉండడంతో అక్కడ విద్యార్థులు చదువుతున్నారు. దుబాయ్ గగనతలంపై వరుసగా మిస్సైళ్ల దాడులు జరుగుతుండడంతో విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో ఆ దేశంలోని బిట్స్‌లో చదువుతున్న తెలుగు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.