సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం

ప్రకాశం: సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని కనిగిరి వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ అన్నారు. గురువారం పామూరు మండలంలోని మార్కండాపురంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గతంలో చేసిన మోసాలే ఈ కూటమి ప్రభుత్వంలో కూడా చేస్తున్నారన్నారు. ఆనాటి రాజన్న రైతు రాజ్యం మళ్లీ రావాలంటే జగనన్నకే సాధ్యమన్నారు.