మెట్రో ఛార్జీల పెంపు.. సీఎం నిర్ణయం కోసం ఎదురుచూపులు..!

HYD: నగరంలో మెట్రో రైలు ఛార్జీలను పెంచాలని L&T మెట్రో రైల్ అధికారులు నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ఈ విషయంపై సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో నిన్న జరగాల్సిన సమావేశం వాయిదా పడటంతో ఫైల్ పెండింగ్ ఉండిపోయింది. మే 10 నుంచి ఛార్జీలు పెంచాలని మెట్రో అధికారులు భావిస్తున్నా ఇంకా గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఎదురుచూస్తున్నారు.