'ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని నిరసన'
HYD: ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి 10ఏళ్లు కాలయాపన చేసి మోసం చేశారన్నారు.