VIDEO: కబడబొడ్డపుట్టులో తాగునీటి కష్టాలు
ASR: డుంబ్రిగుడ మండలం కబడబొడ్డపుట్టులో తాగునీటి కష్టాలు తీర్చాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఏడాది క్రితం జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా మంజూరైన కొళాయి పైపులైన్ పనులను నిర్మాణం చేపట్టి గుత్తేదారు అర్ధాంతరంగా విడిచిపెట్టేశారు. వేసవి సమీపిస్తున్న తరుణంలో తాగునీటికీ ఇబ్బందులు పడుతున్నామని పెసా కమిటీ ఉపాధ్యక్షుడు నాగేశ్వరావు తెలిపారు. దీనిపై అధికారులు స్పందించాలన్నారు.