పేపర్ లీక్.. 30 మంది ఏఈవోల సస్పెండ్
JGL: అగ్రికల్చర్ బీఎస్సీ పరీక్షల్లో పేపర్ లీకేజీకి పాల్పడి దొరికిపోయిన 30 మంది ఇన్ సర్వీస్ ఏఈవోలను యూనివర్సిటీ అధికారులు సస్పెండ్ చేశారు. ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్ ద్వారా షేర్ చేసి లీకేజీకి కారణమైన 30 మందితోపాటు సహకరించిన నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఇందులో జగిత్యాల జిల్లాలో 8 మంది, సిరిసిల్లలో ముగ్గురు, మిగతా వారు వరంగల్‌కు చెందిన వారు ఉన్నారు.