చిన్నారుల మృతిపై మంత్రి లోకేష్ దిగ్బ్రాంతి

KRNL: ఆస్పరి మండలం చిగిలిలో చిన్నారుల మృతి ఘటనపై మంత్రి నారా లోకేష్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. "నీటి గుంటలో పడి శశికుమార్, కిన్నెర సాయి, భీమా, వీరేంద్ర, మహబూబ్ మృతి చెందిన ఘటన నన్ను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ఎంతో ఉన్నతమైన భవిష్యత్తు గల బాలలు ఇలా అర్ధాంతరంగా చనిపోవడం బాధాకరం. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాల అండగా నిలుస్తుంది" అని పేర్కొన్నారు.