రైతుల కోసం కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

సత్యసాయి: కలెక్టర్ ఆదేశాలతో రైతుల సందేహాలు తీర్చేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. రైతులు 91777 68274, 99482 24545 నెంబర్లను సంప్రదించి అవసరమైన సమాచారం పొందవచ్చని సూచిస్తూ.. యూరియా కొరతపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు.