నేడు, రేపు పెసా కమిటీ ఎన్నికలు

ASR: చింతపల్లి మండలంలోని 15 పెసా గ్రామ కమిటీలకు ఈనెల 25, 26వ తేదీల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు ఎంపీడీవో సీహెచ్ సీతామహాలక్ష్మి తెలిపారు. గతంలో వాయిదా పడిన ఈ గ్రామ సభలకు ఎన్నికలు నిర్వహించనున్నామన్నారు. పీవో, ప్రిసైడింగ్ అధికారులు రెండు రోజులు నిర్ణయించిన సమయంలో గ్రామ సభ ఏర్పాటు చేసి, పెసా ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఎన్నికలు నిర్వహిస్తారన్నారు.