జాతీయస్థాయి టోర్నీకి ఎంపికైన క్రీడాకారులు

MBNR: దేశ రాజధాని ఢిల్లీలో అతి త్వరలో ప్రారంభం కానున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నీకి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చెందిన క్రీడాకారులు భాను ప్రకాష్, వెంకటప్ప, బాలరాజు, సుభాష్ ఎంపికయ్యారు. ఈ నెల 9, 10 తేదీల్లో హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి టోర్నమెంట్‌లో వీరు ప్రతిభ కనబరిచారు. వీరిని మహబూబ్‌నగర్ డీవైఎస్‌ఓ శ్రీనివాస్ అభినందించారు.