రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు
AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 17, 18 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. బంగాళాఖాతంలో 17న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వివిధ మోడళ్లు సూచిస్తున్నాయి. దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండబోదని నిపుణులు అంచనా వేస్తున్నారు.