'శ్రీశైలం ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలి'

'శ్రీశైలం ఎమ్మెల్యేను సస్పెండ్ చేయాలి'

VZM: శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌ను సస్పెండ్ చేయాలని జై భీమ్ రావ్ భారత్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నరసయ్య డిమాండ్ చేశారు. నెల్లిమర్లలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. దళిత వర్గాలకు చెందిన అటవీశాఖ అధికారులపై ఎమ్మెల్యే దాడి చేయడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.