ఆపదలో ఆపన్న హస్తంగా సీఎం రిలీఫ్ ఫండ్
PLD: ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం పిడుగురాళ్ల పార్టీ కార్యాలయంలో అనారోగ్య కారణాల వల్ల హాస్పటల్లో చికిత్స చేయించుకున్న ఆర్థిక స్తోమత లేని వారికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల వారికి అందజేశారు.