VIDEO: రేషన్ షాప్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే నాగరాజు

HNK: సన్నబియ్యం పంపిణీ సందర్భంగా శనివారం హసన్ పర్తి మండలం మల్లారెడ్డిపల్లె గ్రామంలో రేషన్ షాప్‌ను వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారులతో మాట్లాడి వివరాలను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు, రేషన్ పంపిణీ, సాంకేతిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చివరి లబ్ధిదారుడి వరకు ప్రభుత్వ పథకాలను అందించాని ఎమ్మెల్యే తెలిపారు.