కాలువ పూడిక తీత పనులు పరిశీలించిన ఎమ్మెల్యే

ELR: కలిదిండి మండలం తాడినాడ గ్రామములో శుక్రవారం కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డా. కామినేని శ్రీనివాస్ పర్యటించారు. పోలరాజ్ పంట కాలువలో పంటి మీద మెషిన్‌తో పూడిక తీత పనులు పరిశీలించారు. కాలువలు పూడిక తీత పనులు త్వరగా పూర్తి చేసి రైతులకు నీళ్లు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేసారు. ఈ కార్యక్రమం NDA నాయకులు, నీటి సంఘం నాయకులు పాల్గొన్నారు