VIDEO: చికెన్ బిర్యానీలో బొద్దింకల కలకలం

VSP: విశాఖ నగరంలోని ప్రముఖ రెస్టారెంట్లలో ఒకటైన జీషన్లో ఆహార నాణ్యతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇక్కడ చికెన్ బిర్యానీ తిన్న కొందరు కస్టమర్లకు అందులో బొద్దింకలు కనిపించడంతో కలకలం రేగింది. ఈ సంఘటన మంగళవారం వెలుగు చూసింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన వినియోగదారులు రెస్టారెంట్ సిబ్బందికి ఫిర్యాదు చేశారు.