కురవంకలో ఆక్రమణలు తొలగించండి: ఎమ్మెల్యే

కురవంకలో ఆక్రమణలు తొలగించండి: ఎమ్మెల్యే

CTR: మదనపల్లి పట్టణంలోని కురవంకలో ఆక్రమణలు తొలగించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కురవంకలో పర్యటించారు. అధికారులు జవాబుదారీతనంతో పని చేయాలన్నారు. పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం తగదని, పనిచేయని వారిపై చర్యలు తప్పవని మున్సిపల్ అధికారులను ఎమ్మెల్యే హెచ్చరించారు.