హోలి పండగా.. పోలీసులు పలు సూచనలు
NLG: హోలి పండగా సందర్భంగా హాలియ పట్టణ ప్రజలకు పోలీసులు పలు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ పెద్ద కాలువలో స్నానం చేయడం పూర్తిగా నిషేదమని SI సాయిప్రశాంత్ తెలిపారు. ఎడమ కాలువలో ప్రవాహం తీవ్రంగా ఉండటంతో, నీటిలో మునిగే ప్రమాదం ఉందన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక పర్యవేక్షణ వహించి ప్రమాద ప్రాంతలకు వెళ్లనీయవద్దని వెల్లడించారు. 'మీ భద్రతే మా ప్రాధన్యమని' తెలియజేశారు.