24 గంటల్లో అదృశ్య బాలికను గుర్తించిన పోలీసులు
CTR: ఏప్రిల్ 3న కార్వేటినగరంలో అదృశ్యమైన ఒక బాలికను చిత్తూరు పోలీసులు వేగంగా స్పందించి 24 గంటల్లో గుర్తించారు. శనివారం బాలికను సురక్షితంగా కనుగొని, ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుల తక్షణ చర్యలు, సమర్థ దర్యాప్తుతో ఈ కేసు విజయవంతంగా పరిష్కారమైంది. పోలీసులను ఎస్పీ తుషార్ డూడీ అభినందించారు.