పడిపోతున్న ఉష్ణోగ్రతలు
PPM: మన్యంలో శీతల వాతావరణం కొనసాగు గురువారం జి.మాడుగులలో 8.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదై నట్లు చింతపల్లి వ్యవసాయ పరిశోధనాస్థానం వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. ముంచంగిపుట్టులో 8.9, డుంబ్రిగుడ 9.1, చింతపల్లి, అరకులోయలో 9.5, పాడేరులో 9.8 డిగ్రీలు నమోదయ్యాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.