ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
ELR: జంగారెడ్డిగూడెం మండలం వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు వాడవాడలా ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి రామాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. భక్తులు క్యూ లైన్‌లో ఉండి స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తున్నారు. అలాగే రాములవారికి అర్చకులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మధ్యాహ్నం స్వామి వారి కళ్యాణం జరగనుంది.