VIDEO: దేవరాపల్లిలో భూవివాదంపై ఉద్రిక్తత

VIDEO: దేవరాపల్లిలో భూవివాదంపై ఉద్రిక్తత

AKP: దేవరాపల్లి రెవెన్యూ పరిధిలో రెండు వర్గాల మధ్య నెలకొన్న భూవివాదం బుధవారం ఉద్రిక్తతకు దారితీసింది. వివాదాస్పద భూమిలోకి ఇరువర్గాలు ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించి, ఇరువర్గాలకు సర్దిచెప్పి భూభాగంలోకి వెళ్లకుండా వెనక్కి పంపారు. దీంతో ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.