జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు..!
NLR: జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలంటే జనాలు వనికిపోయేలా భగ్గు మంటున్నాడు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, అత్యధికంగా నెల్లూరుపాలెంలో 42.4 డిగ్రీల సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రత నమోదైంది.