సోమందేపల్లిలో ఆటో డ్రైవర్లకు అవగాహన
సత్యసాయి: సోమందేపల్లి హై స్కూల్‌లో ఆటో డ్రైవర్లకు ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్‌ఐ సుధాకర్ యాదవ్, సీఐ రాఘవన్ ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇన్సూరెన్స్ వంటి డాక్యుమెంట్లు కలిగి ఉండాలని సూచించారు. అధిక వేగంతో వాహనాలు నడపకూడదని పేర్కొన్నారు.