'అంబేడ్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలి'
NZB: రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యుడు ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. శనివారం అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా నగరంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి తదితరులు పాల్గొని నివాళులర్పించారు.