VIDEO: రోడ్డుపై గుంతలతో వాహనదారుల ఇబ్బందులు
ADB: బోథ్ మండల కేంద్రం నుంచి నిర్మల్ వెళ్లే రహదారి భారీ వర్షాలకు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కోరమాండల్ ముందర, పొచ్చేర క్రాస్ రోడ్డు వద్ద ఏర్పడ్డ గుంతలతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.