ఈద్గా పరిసరాలను శుభ్రం చేసిన పంచాయతీ కార్మికులు

ప్రకాశం: పొదిలిలోని ఈద్గాల వద్ద బక్రీద్ పండగ పురస్కరించుకొని ముందస్తుగా పంచాయతీ కార్మికుల చేత కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు బక్రీద్ పండగ పురస్కరించుకొని ఈద్గాల వద్ద ఎలాంటి సమస్య లేకుండా పంచాయతీ కార్మికుల చేత పరిసరాలను పరిశుభ్రం చేయడం జరిగిందన్నారు.