'బెట్టింగ్ పాల్పడితే ఈ నంబర్‌కు సమాచారమివ్వండి'

'బెట్టింగ్ పాల్పడితే ఈ నంబర్‌కు సమాచారమివ్వండి'

E.G: ఐపీఎల్ మ్యాచ్‌ల సాకుతో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డి. నరసింహ కిషోర్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే మాయమాటలతో యువతను లక్ష్యంగా చేసుకునే వారిపై నిఘా ఉంచామన్నారు. బెట్టింగ్ నిర్వాహకుల గురించి సమాచారం ఉంటే వెంటనే డయల్ 112కు తెలపాలని కోరారు.