VIDEO: న్యూమోనియా వ్యాధిపై అవగాహన
NLR: మనుబోలు ప్రభుత్వ వైద్యశాలలో ఆశా వాలంటీర్లతో ప్రభుత్వ వైద్య అధికారి డాక్టర్ గేయ పూజిత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. న్యూమోనియా వ్యాధిని అశ్రద్ధ చేస్తే ప్రాణాలు తీస్తుందని తెలిపారు. ఇది ఐదేళ్లలోపు చిన్నారులకు, 60 సంవత్సరాలు పైబడిన వారికి సోకుతుందన్నారు. వారు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.