VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రం ఇన్‌ఛార్జిని మార్చండి: కలెక్టర్

WNP: కొత్తకోట మండలం పాలెంలోని వరిధాన్యం కొనుగోలుకేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రానికి వచ్చిన వడ్లు సన్నరకమా, దొడ్డురకమా అని గుర్తించే క్యాలిపర్ మిషన్ ఉపయోగించే విధానం చెప్పకపోవడంతో కొనుగోలు కేంద్రం ఇన్‌ఛార్జిపై కలెక్టర్ అగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే అతన్ని మార్చాలని ఆదేశించారు.