'పదో తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీలు చేయాలి'
NZB: పదో తరగతి పరీక్షా కేంద్రాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సబ్ కలెక్టర్లు, ఆర్డీవో, తహసీల్దార్లకు కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం సూచించారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు సాఫీగా జరిగేలా చొరవ చూపాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు దిలీప్ కుమార్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.