ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన మంత్రి
ELR: జిల్లా ఇంఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉంగుటూరు నేషనల్ హైవే పక్కనే ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తానే స్వయంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఉన్న ఇబ్బందులను రైతులను అడిగి తెలుసుకున్నారు. అలాగే రైతుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సమర్థంగా అమలవుతున్నాయా, లేదా అని ఆరా తీశారు.