రూ.50 వేలకే 'మేడ్ ఇన్ ఇండియా' మినీ బైక్

రూ.50 వేలకే 'మేడ్ ఇన్ ఇండియా' మినీ బైక్

భారతీయ సంస్థ KNK కార్ట్స్ మినీ బైక్‌(పిట్ బుల్ 1.0)ను లాంచ్ చేసింది. రూ.50,000 ధర కలిగిన ఈ బైక్ పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తి. ఇందులో 80cc ఆటోమేటిక్ ఇంజిన్ ఉండగా, బరువు కేవలం 40 కిలోలే. ఇది రోడ్లపై నడపడానికి వీలులేదు. కేవలం ఫామ్ హౌస్‌లు, ఆఫ్‌రోడ్ ట్రాక్‌లకే పరిమితం. డిస్క్ బ్రేక్స్, ఆఫ్‌రోడ్ టైర్లతో వచ్చే ఈ బైక్ డెలివరీలు జూన్ నుంచి మొదలవుతాయి.