విద్యతోనే జ్ఞానం లభిస్తుంది: ఎస్పీ

విద్యతోనే జ్ఞానం లభిస్తుంది: ఎస్పీ

SKLM: విద్యతోనే జ్ఞానం లభిస్తుందని, జ్ఞానం సమాజ అభివృద్ధికి పునాది అని జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి అన్నారు. ఇవాళ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ మేరకు ఆయన ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దేశానికి కలాం చేసిన సేవలను స్మరించుకున్నారు.