రహదారి ప్రమాదం.. ముగ్గురికి గాయాలు

రహదారి ప్రమాదం.. ముగ్గురికి గాయాలు

CTR: ఓ బైకు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన శుక్రవారం బంగారుపాలెం మండలంలో చోటుచేసుకుంది. బెంగళూరు-చెన్నై హైవే పాలమాకులపల్లి స్పీడ్ బ్రేకర్ వద్ద బైకు అదుపు తప్పింది. ఈ ఘటనలో బైకు మీద వెళుతున్న ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.