కోల్లేరు సరస్సు గురించి మీకు తెలుసా..!

ELR: కోల్లేరు సరస్సు వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాల మధ్య విస్తరించిన మంచి నీటి సరస్సు. ఇది భారత్‌లో అతిపెద్ద మంచి నీటి సరస్సుల్లో ఒకటి. ఇక్కడకి శీతాకాలంలో వేలాది వలస పక్షులు వచ్చి నివాసముంటాయి. ముఖ్యంగా పెలికాన్‌లు, గుళ్లగూని, స్పూన్ బిల్స్ వంటి అరుదైన పక్షులు కనిపిస్తాయి. ఈ సరస్సు ప్రకృతి ప్రేమికులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.