నేడు ఈ ప్రాంతాలకు విద్యుత్ నిలిపివేత

నేడు ఈ ప్రాంతాలకు విద్యుత్ నిలిపివేత

శ్రీకాకుళం: కవిటీ మండలం రాజపురం ఉపకేంద్రం పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం ఇవాళ విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడనుందని పలాస ఈఈ యజ్ఞేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. వింధ్యగిరి, భైరిపురం గ్రామాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు సరఫరా నిలిచిపోతుందని, గృహ, వ్యవసాయ వినియోగదారులు సహకరించాలని కోరారు.