బేస్తవారిపేటలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం

ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని రెట్లపల్లి, పెద్ద ఓబినేనిపల్లి గ్రామాలలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రఫీక్ మాట్లాడుతూ.. మొక్కజొన్న పైరును విత్తన ఉత్పత్తి కొరకు సాగుచేసే రైతులు విత్తన ఉత్పత్తి కంపెనీ ప్రతినిధుల నుండి అగ్రిమెంట్ తీసుకున్న తర్వాతనే సాగు చేయాలని రైతులకు సూచించారు.