VIDEO: రసాభాసగా అనంతపురం కౌన్సిల్ సమావేశం

VIDEO: రసాభాసగా అనంతపురం కౌన్సిల్ సమావేశం

అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయని కౌన్సిల్‌లో ఆందోళన వ్యక్తమైంది. అధికారులు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వైసీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. తాము చెప్పే పనులు చేయడం లేదన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే, మేయర్ మహమ్మద్ వసీం మధ్య వాగ్వాదం జరిగింది.