VIDEO: పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవు: CI
ADB: పోలీసుల పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ బుధవారం అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏరోడ్రంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఆపి ఉన్న పోలీస్ వాహనంతో ఫోటోలు, వీడియోలు తీసిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. అటు విధులలో నిర్లక్ష్యంగా ఉన్న పోలీసు సిబ్బందిపై శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.