'బీజేపీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలి'

KMM: ఖమ్మం 39వ డివిజన్ లో శుక్రవారం జైబాపు, జైభీమ్, జై సంవిధాన్ యాత్ర నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ.. బీజేపీ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని పేర్కోన్నారు. అంబేద్కర్ ఆశయాలను నీరుగారుస్తూ, మహాత్మా గాంధీ స్ఫూర్తిని దెబ్బతీసేలా పరిపాలన కొనసాగుతున్న బీజేపీ తీరును తిప్పి కొట్టడమే ఈ యాత్ర ఉద్దేశమని తెలిపారు.