చెరువులో పూడికతీత పనులు.. ఆనందంలో రైతులు
MHBD: నెల్లికుదురు మండలంలోని రామన్నగూడెం గ్రామ చెరువులో పూడికతీత పనులను స్థానికులతో కలిసి సర్పంచ్ బండి శ్రీను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువులో పూడికతీత పనులు చేపట్టడంతో రైతులు ఆనందంగా ఉన్నారని, చెరువు లోతుగా అవుతున్నందున నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని పేర్కొన్నారు.