ఎమ్మెల్యే నివాసంలో అయ్యప్ప స్వామిమహా పడి పూజ
SRD: ఖేడ్ పట్టణంలో MLA సంజీవరెడ్డి నివాసంలో శ్రీ అయ్యప్ప స్వామి మహా పడి పూజలతో అయ్యప్ప నామస్మరణ మారుమోగింది. MLA దంపతులు, వారి కుమారుడు అనురాగ్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ నేత్రపర్వంగా నిర్వహించారు. అనంతరం సంజీవరెడ్డి దంపతులు అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని నెత్తిపై ఎత్తుకొని నియమ నిష్టలతో కొలిచారు. ఊగు ఊగు.. అయ్యప్ప ఉయ్యాల.. అంటూ పాటలు పాడారు.