VIDEO: అయ్యప్ప స్వామి ఆలయంలో గోపూజ
PDPL: ధర్మారం మండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో బుధవారం ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు ఈశ్వర్ ఆధ్వర్యంలో గోమాతను పసుపు, కుంకుమ, పూలతో అందంగా అలంకరించి పూజలు చేశారు. ఆలయ పురోహితుడు నర్సింగరావు మంత్రోచ్ఛారణల నడుమ భక్తులు గోమాత చుట్టూ ప్రదక్షిణం చేస్తూ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి హిందువు గోమాతను పూజించాలని ఈశ్వర్ సూచించారు.