ఆరిలోవలో పేకాట ఆడుతున్న ఆరుగురు అరెస్ట్

VSP: ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు పోలీసులు రైడ్ చేశారు. ఈ రైడ్లో పేకాట ఆడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,52,000 స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్థానిక పోలీసులు హెచ్చరించారు.