ఉచిత గ్యాస్ సిలిండర్ ఎప్పుడు అంటే

కృష్ణా: దీపం 2 పథకంలో భాగంగా 2025-26లో ఉచిత గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారులు దరఖాస్తు చేయాలని జేసీ గీతాంజలి శర్మ తెలిపారు. ఈ ఏడాది మూడు విడతల్లో సిలిండర్‌లు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఏప్రిల్-జులైలో మొదటిది, ఆగస్టు-నవంబర్‌లో రెండవది, డిసెంబర్-మార్చిలో మూడవది ఉచితంగా అందించనున్నారు. గతేడాది 3,60,500 సిలిండర్లు ఇచ్చారు. ఇప్పటి వరకు 59,333 పంపిణీ చేశారు.