సాయి కుల్వంత్ హాల్‌లో 'గార్లాండ్ ఆఫ్ స్ట్రింగ్స్' సితార్ కచేరీ
సత్యసాయిబాబా శత జయంతి వేడుకల్లో భాగంగా శుక్రవారం రాత్రి సాయి కుల్వంత్ హాల్‌లో రూపా పనేసర్ 'గార్లాండ్ ఆఫ్ స్ట్రింగ్స్' కచేరీని ప్రదర్శించారు. ఉస్తాద్ కృపాల్ సింగ్ పనేసర్, సుఖ్వీందర్ సింగ్ సహా పలువురు కళాకారులు ఇందులో పాల్గొన్నారు. భగవాన్‌పై ప్రేమతో 'ఓ పాలన్ హరే', 'ఐసీ లగీ లగన్' వంటి ప్రసిద్ధ భజనలను ఆలపించారు.