సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూడాలి: జనార్దన్

ప్రకాశం: సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందాల చూడాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. ఆదివారం ఒంగోలు నగరంలోని టీడీపీ కార్యాలయంలో 45, 47 డివిజన్ల కుటుంబ సాధికార సభ్యులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. టీడీపీ ప్రతిష్టాత్మకంగా ప్రతి 60 ఓటర్లకు ఇద్దరు కుటుంబ సాధికార సభ్యులను నియమించిందన్నారు. సంక్షేమ ఫలాలు అందని వారిని గుర్తించి, వారికి అందించాలన్నారు.