నేడు రొంపిచెర్ల మండల సమావేశం

CTR: రొంపిచెర్ల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చిచ్చిలి పురుషోత్తంరెడ్డి అధ్యక్షతన ఈరోజు ఉదయం 10 గంటలకు మండల సర్వసభ్య సమావేశం జరుగుతుందని ఎంపీడీవో మధుసూదన్ రెడ్డి తెలిపారు. మండలంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, సర్పంచులు తప్పక హాజరుకావాలని కోరారు.