కేటీఆర్‌కు రాజకీయ పరిపక్వత లేదు: జగ్గారెడ్డి

TG: మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను చిల్లర పార్టీ అంటారా? అని మండిపడ్డారు. సోనియా వల్లనే తెలంగాణ వచ్చిందని కేసీఆర్ చెప్పలేదా? అని నిలదీశారు. కాంగ్రెస్‌పై మాట్లాడిన కేటీఆర్‌కు క్యారెక్టర్ లేదని దుయ్యబట్టారు. కేటీఆర్‌కు రాజకీయ పరిపక్వత లేదని విమర్శించారు.